Rohit Sharma: ఆ కారణంతోనే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నా: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Press Conference after IND vs WI 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4), రవీంద్ర జడేజా (3) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. షై హోప్ (43; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (52; 46 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంటిరీ చేశాడు. అయితే విండీస్ లాంటి జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోక.. బౌలింగ్ ఎంచుకోవడం ఏంటని నెట్టింట విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బౌలర్లను పరీక్షించేందుకు టాస్ నెగ్గగానే బౌలింగ్ ఎంచుకున్నా అని స్పష్టం చేశాడు. ‘బార్బడోస్ పిచ్ ఇలా స్పందిస్తుందని ఏమాత్రం అనుకోలేదు. బౌలర్లను పరీక్షించేందుకు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నా. పేసర్లు, స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం అందింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు. ప్లేయర్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనేదే మా లక్ష్యం. వీలైనప్పుడు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తాం’ అని రోహిత్ అన్నాడు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Sanju Samson Jersey: భారత్-వెస్టిండీస్ తొలి వన్డేలో సంజూ శాంసన్.. గందరగోళానికి గురైన ఫాన్స్!
‘వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పలేను. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా ఆడిస్తాం. నేను ఏడో స్థానంలో రావడంపై చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇదేమీ కొత్త స్థానం కాదు. అరంగేట్ర సమయంలో ఇదే స్థానంలో బ్యాటింగ్ చేశాను. ఈరోజు మరోసారి ఆ రోజులు గుర్తొచ్చాయి. ముకేశ్ కుమార్ రెండు వైపులా బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలిగాడు. ఇక కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజా, ఇషాన్ కిషన్ బాగా ఆడారు’ అని భారత కెప్టెన్ ప్రశంసించాడు.
స్వల్ప లక్ష్యం ఉండడంతో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రాలేదు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేశారు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ రోహిత్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్‌కు దిగలేదు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌లో ముందుకు వచ్చారు.
Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లోనూ మార్పు!
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!