Rohit Sharma Test Record: 146 ఏళ్ల టెస్ట్ చరిత్ర.. ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Captain Rohit Sharma Becomes First Batter In Test History: అంతర్జాతీయ టెస్టు చరిత్రలో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో వరసగా అత్యధిక ఇన్నింగ్స్‌లలో రెండు అంకెల స్కోర్ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన హిట్‌మ్యాన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే రికార్డు బద్దలు కొట్టాడు.
వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోరు చేసిన రికార్డు నిన్నటివరకు మహేలా జయవర్ధనే పేరుపై ఉంది. జయవర్ధనే వరుసగా 29 ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు నమోదు చేశాడు. ఇప్పుడా రికార్డును హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అధిగమించాడు. హిట్‌మ్యాన్ వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో రెండు అంకెల స్కోర్ అందుకున్నాడు. దాంతో 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా.. ఇలా వరుసగా టెస్టులు రోహిత్ శర్మ ఆడాడు. గత 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ రెండంకెల స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. రోహిత్ స్కోర్లు (Consecutive Test Inning without a Single Digit Score) ఇలా ఉన్నాయి. 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57లుగా ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్.. రెండో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో రోహిత్ 240 పరుగులు చేశాడు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి హిట్‌మ్యాన్ అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి విండీస్‌పై 466 పరుగులు చేశారు. రెండు టెస్టుల సిరీస్‌లో అంతర్జాతీయంగా ఇది మూడో అత్యధిక ఓపెనింగ్ పార్టనర్‌షిప్. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ గ్రేమ్ స్మిత్-నీల్ మెకంజీ 2008లో బంగ్లాపై 479 పరుగులు చేశారు.
Also Read: Lectrix EV Scooter Launch: ఎథర్, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
Consecutive Test Inning without a Single Digit Score 🏏
30* – Rohit Sharma(2021-23) * 🇮🇳
29 – Mahela Jayawardene (2001-02) 🇱🇰
25 – Len Hutton (1951-53) 🇮🇳
25 – Rohan Ka hai (1961-65) 🏝️
24 – AD de Villiers (2012-14) 🇿🇦#INDvWI | #RohitSharma𓃵 pic.twitter.com/vdWGGdSzbo— SANJU (@Squarecut45_) July 23, 2023
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..