IndvsWI: ఛీ ఛీ.. చివరికి విండీస్ చేతిలో ఓడిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌ని 1-0 తేడాతో గెలిచిన భారత జట్టుకి రెండో వన్డేలో ఊహించని విధంగా గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, వెస్టిండీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుంది. దీంతో వన్డే సిరీస్ 1-1తో సమం అయింది. ఆగస్టు 1న జరిగే ఆఖరి వన్డే, సిరీస్ విజేతను డిసైడ్ చేయనుంది..
Read Also: Viral Video: వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న లవర్స్.. ఇదేం పిచ్చి..
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
182 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి మంచి ఆరంభం దొరికింది. కైల్ మేయర్స్, బ్రెండన్ కింగ్ కలిసి తొలి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన కైల్ మేయర్స్‌ని శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయగా.. అదే ఓవర్‌లో బ్రెండన్ కింగ్‌ని కూడా పెవిలియన్ కి పంపించాడు. ఇక అలిక్ అతనజేను ( 9 బంతుల్లో 6 పరుగులు) కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి చేరాడు. 15 బంతుల్లో 9 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు..
Read Also: LIC Policy : ఎల్‌ఐసీ పాలసీపై లోన్ ఎలా పొందాలి?
విండీస్ 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్, కెసీ కార్టీ కలిసి ఐదో వికెట్‌కి 91 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. షై హోప్ (80 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా కెసీ కార్టీ (65 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు) 48 రన్స్ చేశాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 40.5 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత టీమిండియా శుబ్‌మన్ గిల్ ( 49 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు ) రూపంలో వికెట్ కోల్పోయింది.
Read Also: Kangana Ranaut: ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. కరణ్ జోహర్‌పై కంగనా ఎటాక్
శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ ( 55 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు ) వికెట్ పడిపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ( 14 బంతుల్లో 7 పరుగులు ), జేడన్ సీల్స్ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 113 పరుగులకే కీలకమైన నాలుగో వికెట్లను టీమిండియా కోల్పోయింది. చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్, రాక రాక వచ్చిన అవకాశాన్ని పెద్దగా వాడుకోలేకపోయాడు. 19 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసిన కరియా బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Read Also: Kangana Ranaut: ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. కరణ్ జోహర్‌పై కంగనా ఎటాక్
సంజూ శాంసన్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 113 పరుగులు చేసింది. కొద్దిసేపు విరామం తర్వాత ఆట స్టార్ట్ అయింది. రవీంద్ర జడేజా( 21 బంతులు ఆడి 10 పరుగులు), రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు) కొదీసేపు పోరాడి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. శార్దూల్ ఠాకూర్ ( 22 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు ) అల్జెరీ జోషఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ ఓ బౌండరీ, కుల్దీప్ యాదవ్ మరో బౌండరీ బాదడంతో టీమిండియా 181 స్కోరు అయినా చేయగలిగింది.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!