Rohit Sharma Set To Miss ODI World Cup 2023 IND vs ENG Match Today: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నేడు ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శనివారం లక్నోలో ప్రాక్టీస్ చేసిన హిట్‌మ్యాన్‌కు గాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం కారణంగా ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు…
ప్రపంచకప్ 2023లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనిపిస్తున్నాడు. టోర్నీలో ఓ సెంచరీ నమోదు చేయగా.. మిగిలిన మ్యాచ్ ల్లోనూ దూకుడుగా ఆడి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తర్వాత జరిగే ఇంగ్లండ్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అయితే ఒకటి, రెండు కాదు.. మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనున్నాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్మెంట్ అతడికి రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్.
Rohit Sharma React on India win against New Zealand: వన్డే ప్రపంచకప్ 2023లో తమ లక్ష్యం సగం మాత్రమే పూర్తయిందని, అసలు సమరం (సెమీస్, ఫైనల్) ముందుంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు గతంలోనూ ఎన్నో వచ్చాయని రోహిత్ కొనియాడాడు. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉందని…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 సిక్సర్లు కొట్టి మరే క్రికెటర్ చేయలేని పని చేశాడు. న్యూజిలాండ్‌పై 40 బంతుల్లో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ఒక క్యాలెండర్ ఇయర్లో 50 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
Rohit Sharma and Virat Kohli interview Ahead of IND vs NZ Match: తప్పకుండా ఈసారి న్యూజిలాండ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని.. వ్యక్తిగతంగానూ, జట్టు పరంగానూ ఏం చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చామని భారత సారథి రోహిత్ శర్మ తెలిపాడు. న్యూజిలాండ్ వ్యూహాలను అమలు చేయడంలో దిట్టని అభిప్రాయపడ్డాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే కివీస్ సక్సెస్ అవుతోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో నేడు…
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కాలుకు బంతి తగిలింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే చిన్న దెబ్బ కదా.. మళ్లీ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బ బలంగా తాకడంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో కూడా ఆడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటే ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్…
Rohit Sharma Gives Update on Hardik Pandya Injury: పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పెద్ద గాయం ఏం కాలేదని, భయపడాల్సిందేం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. హార్దిక్ గాయం నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని, వారిని మరింత ఉత్సాహపరిచే విజయాలను అందుకుంటామని రోహిత్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో…
ప్రపంచకప్ 2023లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. ఈ ట్రోఫీలో తన బ్యాట్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ.. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు.. ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 2…
రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు జల్లు కురిపించాడు. రోహిత్ ఒక గొప్ప బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. గతంలో కెప్టెన్ గా ధోనీకి టీమ్ సభ్యుల్లో ఎంతో గౌరవం ఉండేదో... ఇప్పుడు రోహిత్ కు అలాంటి గౌరవం లభిస్తోందని చెప్పాడు.