T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి. దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది.
విదేశీ గడ్డపై భారత జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియాకు అభినందనలు తెలిపే ప్రక్రియ మొదలైంది.
Rohit Sharma Announce Retirement From T20 Internationals: టీమిండియా కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11…
IND vs SA Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్‌లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు.
మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కోసం క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉంది, ఇది కాకుండా అర్ష్‌దీప్ సింగ్ కూడా తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించగలడు.