Rohit Sharma is Captain IND vs SL ODIs: శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయని తాజాగా తెలిసింది. రోహిత్ నాయకత్వంలోనే భారత జట్టు బరిలోకి దిగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు బీసీసీఐ లేదా రోహిత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు వన్డే సిరీస్ నుంచి విరామం తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. కింగ్ శ్రీలంకతో వన్డే సిరీస్‌లో దాదాపుగా ఆడకపోవచ్చు. బుమ్రా, జడేజాలు కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. అయితే సీనియర్లూ అందుబాటులో ఉండాలని కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు వార్తలు వచ్చాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్టును నేడు ఎంపిక ఉండే అవకాశం ఉంది.
Also Read: Urvashi Rautela Video: ఊర్వశీ రౌతేలా ప్రైవేట్ వీడియో లీక్!
మరోవైపు వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్యా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. టీ20 ఫార్మాట్‌కు మాత్రం తాను అందుబాటులో ఉంటానని బీసీసీఐకి ఇప్పటికే చెప్పాడు. రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో జట్టు పగ్గాలు ఎవరికి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. హార్దిక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పోటీలో ఉన్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కెప్టెన్సీపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.