టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం.. కానీ, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుండటంతో.. #HappyRetirement అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
IND vs AUS: మెల్బోర్న్ టెస్ట్‌లో ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 రన్స్ భారీ లక్ష్యంతో ఐదో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు కేవలం 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4)లు ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా…
రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. సారథిగా రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని, బౌలర్లను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని, 40 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కు తీసుకురావడం అవసరమా? అని ప్రశ్నించారు. ఫీల్డింగ్ సెటప్ కూడా సరిగ్గా లేదని రవిశాస్త్రి మండిపడ్డారు. మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేయగా.. సామ్ కాన్స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72) హాఫ్ సెంచరీలు బాదారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (49) తృటిలో అర్ధ శతకం కోల్పోయాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో తొలి రోజు ఆతిథ్య ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజులో కూడా ఆధిపత్యం చేయిస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్(15)లు క్రీజులో ఉన్నారు. మొదటి రోజు యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (60; 65 బంతుల్లో 6×4, 2×6), స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (72; 145 బంతుల్లో 7×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. అయితే…
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో శామ్ కాన్స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 145…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్షర్ మంగళవారం (డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫొటోను షేర్ చేశాడు. డిసెంబర్ 19న తనకు కొడుకు పుట్టాడని, హక్ష్ పటేల్ అని పేరు కూడా పెట్టినట్లు అక్షర్ వెల్లడించాడు. అక్షర్‌కు ఫాన్స్ విషెష్ తెలియజేస్తున్నారు. అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా…