Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…
భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు వీడ్కోలు పలికారు. తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేకి మాత్రమే పరిమితమయ్యాడు. సరే.. కోహ్లీ ఉన్నాడులే అనుకునేలోపే అభిమానులకు హార్ట్ బ్రేక్ అయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కి ముందే తన టెస్ట్ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేయనున్నాడు.…
Virat Kohli : పాకిస్థాన్-భారత్ సాగిస్తున్న యుద్ధ వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించారు. ‘ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి బిగ్ సెల్యూట్. వారు, వారి కుటుంబ త్యాగాలను వెలకట్టలేం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ తో పాటు ఇతర క్రీడాకారులు…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని భారత వన్డే వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించిన దానికి భారత్ కృతజ్ఞతతో ఉంటుందన్నాడు. ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి అని గిల్ పేర్కొన్నాడు. తాజాగా రోహిత్ టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోహిత్…
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల…
పలువురు భారత్ క్రికెట్ కామెంటేటర్లపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో కామెంటేటర్లు ఎదో ఒక ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుందన్నాడు. ఇతర దేశాల కామెంట్రీ ఒక్కోసారి బాగుంటుందని, భారత్‌లో క్రికెట్ జర్నలిజం తీరు మారాల్సిన అవసరం ఉందన్నాడు. మ్యాచ్ గురించి మాట్లాడటం తక్కువైందని.. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేకుండా పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకే క్రికెటర్‌పై దృష్టిపెట్టి, అతడి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయడం తగదని హిట్‌మ్యాన్…
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టాడు. టెస్ట్ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు తాను గర్వపడుతున్నానని, ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. టీ20, టెస్టు ఫార్మాట్లకు దూరమైన హిట్‌మ్యాన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. అయితే టీ20, వన్డేల్లో తనదైన ముద్ర వేసిన రోహిత్.. టెస్టుల్లో మాత్రం అంతగా రాణించలేదు. హిట్‌మ్యాన్ టెస్ట్ కెరీర్ అంతంత…
టీమిండియా అభిమానులకు భారీ షాక్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. టీ20, టెస్టు ఫార్మాట్లకు దూరమైనా.. వన్డేల్లో హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో 300 సిక్సుర్లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 300 సిక్సుర్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. చెన్నై,…
ఆరంభంలో తడబడ్డా.. ఆపై పుంజుకున్నాడు. జట్టు విజయమే లక్ష్యంగా ఎన్నో రికార్డుల్ని చేజార్చుకున్నాడు. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ని ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ బాధపడలేదు. తన జట్టును గెలిపించడానికి ఎంత కష్టాన్నైనా భరించాడు. విమర్శకులు ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోలేదు. కోట్లు పెట్టి కొనుకున్న యాజమాన్యానికి ఏ నాడు భారం కాలేదు. ఫ్యాన్స్ అతన్ని హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టే భారీ హిట్టింగ్ తో బౌలర్ల…