Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌తో లండన్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్ వేసిన 51వ ఓవర్‌లో రెండో బంతికి సింగిల్‌తో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇక, శతకం అనంతరం జైస్వాల్ తనదైన శైలిలో గాల్లోకి ఎగిరి, గ్యాలరీకి ముద్దులు ఇవ్వడంతో పాటు లవ్ సింబల్ చూపించాడు. దీంతో ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “లవ్ సింబల్ ఎవరివైపు?” అంటూ క్రికెట్ అభిమానులు గుసగుసలాడుతున్నారు. అయితే, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి జైస్వాల్ తల్లిదండ్రులు స్టేడియానికి రావడంతో, వారి కోసమే ఈ ప్రత్యేక సెలబ్రేషన్ అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అంతేకాదు, ఈ సెంచరీని రోహిత్ శర్మకు అంకితం చేస్తూ జైస్వాల్ భావోద్వేగం ప్రదర్శించాడు.
Read Also: POCSO case: మహిళ పై పోక్సో కేస్ నమోదు.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే
అయితే, మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. గ్యాలరీ నుంచి నాకు రోహిత్ శర్మ ఒక మేసేజ్ కూడా పంపించాడని పేర్కొన్నాడు. అందుకే, ఈ మ్యాచ్ లో శతకం కొట్టాను అని తెలిపాడు. గ్యాలరీలో ఉన్న రోహిత్ భాయ్ ని నేను చేశాను.. అప్పుడు ఆటను కొనసాగించమని ఆయన నాకు సూచించాడు.. అందుకే, ఆచి.. తూచి ఆడుతూ.. శతకం కొట్టేను అని జైస్వాల్ వెల్లడించారు.
This loving gesture from Jaiswal towards Rohit after he scored a century shows how much the Garden Boys love their big brother Rohit.🥹❤️ pic.twitter.com/3aABVLzbQS
— Jyran (@Jyran45) August 2, 2025