మిత్రుడు డి.వై చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం దర్శకుడు కె. దశరథ్ కథను అందించారు. అంతేకాదు... నిర్మాణ భాగస్వామిగానూ మారారు. డి.వై. చౌదరి డెబ్యూ మూవీ 'లవ్ యూ రామ్' ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ వీడియో శనివారం విడుదలయ్యాయి.
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ‘నాట్యం’ సినిమాతో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. కమల్ కామరాజ్ 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి సంధ్య రాజుతో కూచిపూడి నేర్చుకున్నాడు. కమల కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేకా సుధాకర్ మరియు భానుప్రియ నాట్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రతిభావంతులైన యువ స్వరకర్త శ్రవణ్ బరద్వాజ్…
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ, వెంకటేశ్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా వేణువులో చేరని గాలికి సంగీతం లేదు... అనే పాటను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చెప్పారు. కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ స్వరరచన చేశారు. అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా…