ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ‘నాట్యం’ సినిమాతో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. కమల్ కామరాజ్ 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి సంధ్య రాజుతో కూచిపూడి నేర్చుకున్నాడు. కమల కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేకా సుధాకర్ మరియు భానుప్రియ నాట్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రతిభావంతులైన యువ స్వరకర్త శ్రవణ్ బరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ‘నాట్యం’ అక్టోబర్ 22 న థియేటర్‌లో విడుదల కానుంది. సంధ్య రాజు తన నిర్మాణ సంస్థ నిశ్రింకల ఫిలిమ్స్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : హేటర్స్ కు రష్మిక దిమ్మతిరిగే రియాక్షన్
కాగా ‘నాట్యం’ సినిమాలకు టాప్ సెలెబ్రిటీల సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలంతా భాగమయ్యారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘నాట్యం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చరణ్ ఈ కార్యక్రమంలో థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. సినిమా తనకు నచ్చిందని చెబుతూ చిత్రబృందానికిఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘నాట్యం’ ట్రైలర్‌లో కూచిపూడి నర్తకి సితార (సంధ్య రాజు) నృత్యం నేర్చుకోవడానికి, కాదంబరి కథను ప్రదర్శించడానికి అన్ని అసమానతలను ఎదుర్కొంటుంది. సంధ్య తన నటన, ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ ద్వారా మైమరపించే నటనను ప్రదర్శించింది.