ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు.
మార్నింగ్ వాకింగ్ కు అని వెళ్లిన ఇద్దరు మహిళలు.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డుపైనే నడుచుకుంటు వెళ్తుండగా.. స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే బెయోన్స్ అండ్ జే జెడ్ ఈ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే తొలిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే రిలీజ్ చేసింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో, కత్వాలి నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా హరిద్వార్ నజీబాబాద్ రహదారిపైకి నీరు భారీగా వచ్చి చేరింది. ఇంతలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
రాజస్థాన్‌లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు 'రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023'. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది.
ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో ఉదయం రోడ్డు కుంగింది. బుధవారం ఉదయం ప్రధాన రహదారి మధ్యలో ఉన్నట్టుండి కుంగిపోయింది. 4 గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై అదృష్టవశాత్తూ ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని కర్జాత్-హస్త్‌పోఖారీలో ఈ రోడ్డును వేశారు. అయితే అలా రోడ్డు వేయడంపై అక్కడి గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా వేసిన రోడ్డును ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.