Singer Mangli Gets Injured in Road Accident: ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో మంగ్లీకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. Also Read: Meetha Raghunath Marriage: పెళ్లి చేసుకున్న ‘గుడ్‌నైట్’ హీరోయిన్…
Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని హెల్మండ్ ప్రావిన్సులో ఆదివారం బస్సు-ఆయిల్ ట్యాంకర్, మోటార్ బైక్ ఢీకొనడంతో 21 మంది మరణించారు. 38 మంది గాయాపడినట్లు ప్రావిన్షియల్ అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘానిస్తాన్ మొత్తం సరైన రోడ్డు వ్యవస్థ లేకపోవడం, కొండలు-పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
Madhya Pradesh Road Accident Today: మధ్యప్రదేశ్లోని రాయిసేన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుల్తాన్పూర్ ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి బృందం హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన…
15 Injured Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతుండగా…
హర్యానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హర్యానాలోని రేవారిలో బుధవారం హర్యానా రోడ్వేస్ బస్సు కారును ఎదురుగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని ఈతేరు-చుండూరుపల్లి గ్రామాల ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శవణం గోపిరెడ్డి (30)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.