ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Jammu and Kashmir Road Accident: జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఎనమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్ ప్రాంతం వద్ద ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read: Budget 2024 : యువతకు ఉపాధి, పేదల సామాజిక సంక్షేమం,…
రాజస్థాన్లోని అల్వార్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కోడలు చిత్రా సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర (59) కూడా కారులో ఉండగా.. ఆయనకు గాయాలయ్యాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు చోటు చేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడింది.. దీంతో ఆ కారును లారీ ఢీ కొట్టింది. దీంతో సంఘటన ప్రదేశంలోనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిల్ లైన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న స్కార్పియో ఓవర్టేక్ చేసే సమయంలో రెండు బైకులను, వెనక ఉన్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైంది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటన ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలోచోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు వెళుతున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది.
ఆదివారం పండుగవేళ ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అందరు సంతోషంగా ఆ ఊరిలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. పండుగపూట మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి కారు-ఆటో ఢీకొని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే…