ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ఇండియా కూటమి గుర్తించింది. అనుకున్నదానికంటే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా హస్తం పార్టీ గుర్తించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీహార్‌లో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓట్లే తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు.
తన రాజకీయ జీవితాన్ని ఐదు కుటుంబాలు నాశనం చేశాయని.. వారి పేర్లు వెల్లడిస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా లాలూ కుమారుడు, ఆర్జేడీ మాజీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందన్నారు.
బీహార్‌లో ఏడాది చివరి కల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.