CM KCR Bihar visit: ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులకు చెక్కులు పంపిణీ చేశారు సీఎం కేసీఆర్. బీహర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందించారు.
Bihar CM convoy attacked, 13 people arrested: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీ పొత్తుతో మళ్లీ నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు నితీష్ కుమార్. ఇదిలా ఉండగా.. ఆదివారం నితీష్ కుమార్ కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే కాన్వాయ్ లో ఆ సమయంలో నితీష్ కుమార్ లేరు.
Tejashwi Yadav comments, Nitish Kumar might be 'strong candidate' for PM: ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి.. ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మోదీకి ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకుంటే.. నితీష్…
BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Nitish Kumar will take oath as Chief Minister of Bihar today: బీహార్ రాష్ట్రంలో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో జట్టు కట్టబోతున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 8వసారి నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గవర్నర్ ను కలిసిన…
Bihar Political Crisis: ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లేందుకే సిద్ధ పడింది. తాజాగా సీఎం నితీష్ కుమార్, బీజేపీతో బంధాన్ని తెంచేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహన్ తో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. బీజేపీతో అధికారం తెంచేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం నితీష్ కుమార్ తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా గవర్నర్ ను కలవనున్నట్లు సమాచారం. దీంతో…