Tejashwi Yadav comments, Nitish Kumar might be ‘strong candidate’ for PM: ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి.. ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మోదీకి ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకుంటే.. నితీష్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరని అన్నారు.
బీహర్ లో ఆర్జేడీ-జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ వస్తుందని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ విమర్శలను ‘ అలసిపోయిన ఉపన్యాసం’, ‘ఏడ్చే తోడేళ్లు’ అని విమర్శించారు. బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం విపక్షాల ఐక్యతకు మంచి సూచన అని ఆయన అన్నారు. బీజేపీ ఆధిపత్యాన్ని చాలా ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయని.. డబ్బు, మీడియా, పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి బీజేపీవన్నీ మాటలే అని.. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోందని తేజస్వీయాదవ్ అన్నారు. నితీష్ కుమార్ 37 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రజల అభిమానాలు కలిగి ఉన్నారని అన్నారు.
Read Also: Hrithik Roshan Zomato Ad Controversy: హృతిక్ రోషన్ ప్రకటనపై జొమాటో క్షమాపణ
ఇటీవల ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బయటకు వచ్చింది. బీజేపీతో అధికారాన్ని పంచుకున్న జేడీయూ ఆ బంధానికి స్వస్తి పలికింది. ఆర్జేడీ పార్టీతో జతకలిసి మళ్లీ అధికారాన్ని చేపట్టింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత, లాలూ కుమార్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంలోకి మారింది. ఇటీవల ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ పార్టీ కూటమిలో 31 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.