Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండటం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన జీవగడియారం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో నిద్రపోకుండా మెలుకువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రిళ్లు మేలుకుని ఉండే నిద్రా విధానాన్ని ‘క్రోనోటైప్’ ని పిలుస్తారు. ఇది డయాబెటిస్‌ని పెంచుతుంది