Ricky Ponting: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Smriti Mandhana: సరికొత్తగా గుడ్ న్యూస్ చెప్పిన వరల్డ్ కప్ విన్నర్.. వీడియో వైరల్..!
కోల్‌కతా టెస్టు ఓటమి తర్వాత జట్టు పగ్గాలు చేపట్టడం ఎవరికైనా కత్తిమీద సామే.. కానీ, పంత్‌కు ఆ ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉందని పాంటింగ్ ‘ఐసీసీ రివ్యూ’లో పేర్కొన్నారు. రిషబ్ పంత్‌కు ఇప్పుడు తగినంత టెస్టు అనుభవం ఉంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఉండటం వల్ల ఆట గమనాన్ని, పరిస్థితులను అతను బాగా అంచనా వేయగలడు. గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం కూడా అతనికి ఉందని చెబుతూ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతను ఈ క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దగలడని నేను నమ్ముతున్నానని పాంటింగ్ తెలిపారు.
ఇకపోతే పాంటింగ్, పంత్‌ల మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు పంత్ కెప్టెన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, పంత్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు మారినప్పటికీ.. పంత్ నాయకత్వ పటిమపై పాంటింగ్‌కు పూర్తి విశ్వాసం వెళ్లబుచ్చాడు. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ఆడే క్రమంలో శుభ్‌మన్ గిల్ మెడకు గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతన్ని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. గిల్ ప్రస్తుతం జట్టుతో పాటే వెళ్లినప్పటికీ, మ్యాచ్ సమయానికి అతను కోలుకుంటాడా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి నుంచే తొలి టెస్టు!
ఇక తొలి టెస్టులో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 93 పరుగులకే కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో గిల్ గైర్హాజరీలో పంత్ కొంతసేపు సారథ్యం వహించాడు. దీనితో ఇప్పుడు డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే గువహటి టెస్టులో గెలుపు భారత్‌కు చాలా అవసరం. ఒకవేళ గిల్ ఆడకపోతే, పంత్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.