మూడు నెలల విరామం తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల మొదటి మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. భారత్-ఏ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్.. బ్యాటింగ్ చేయకముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఇందుకు కారణం అతడు టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ ధరించడమే.
దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ 18 నంబర్ జెర్సీ ధరించి రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చాడు. ఆ జెర్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కింగ్ టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఆ జెర్సీని ధరించాడు. పంత్ జెర్సీ నంబర్ 17 అన్న సంగతి తెలిసిందే. అయితే పొరపాటున 18గా ప్రింట్ అయిందా? లేదా కావాలనే 18 జెర్సీని ధరించాడా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. మొత్తానికి పంత్ జెర్సీ ద్వారా చర్చనీయాంశంగా మారాడు. గతంలో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18వ నంబర్ జెర్సీని ధరించాడు.
సాధారణంగా స్టార్ ఆటగాళ్లు రిటైర్‌మెంట్ ఇచ్చినపుడు.. వారి జెర్సీ నంబర్లకు కూడా వీడ్కోలు ఇస్తారు. టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు.. బీసీసీఐ వారి జెర్సీ నంబర్లకు రిటైర్‌మెంట్ ఇచ్చింది. ఆ రెండు జెర్సీలను ఎవరూ వాడకూడదు. విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. 18 నంబర్‌ను రిటైర్ చేయాలనిబీసీసీఐని ఫాన్స్ కోరారు. ఈ విషయంలో బీసీసీఐ ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే విరాట్ ఇంకా వన్డేల్లో ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చాక బీసీసీఐ ఆలోచన చేసే అవకాశం ఉంది.
Rishabh Pant was spotted wearing the number 18 jersey in the India A vs South Africa practice Test 👀 pic.twitter.com/qgNueiGHjd
— Leisha (@katyxkohli17) October 30, 2025