Home
Ring Of Fire
Ring Of Fire News
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
Earthquake: పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో అసలేం జరుగుతోంది. కేవలం 7 రోజుల్లో 187 భూకంపాలు సంభవించడం శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం జపాన్, ఇండోనేషియా, అలస్కా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు నమోదయ్యాయి. 4.5 తీవ్రత లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న 187 భూకంపాలు వచ్చాయి. వీటిలో ఇండోనేషియాలో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం అతిపెద్దది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి..? రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ… -
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
Earthquake: ఇండోనేషియా వరస భూకంపాలతో వణుకుతోంది. ఆగస్టు 15న ఆ దేశంలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వీటిలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ భూకంపాలకు ప్రధాన కారణం, భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. ఇండోనేషియా ఆస్ట్రేలియన్ ప్లేట్, సుండా ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్ అనే నాలుగు టెక్టానిక్ ప్లేట్ల కలయిక స్థానంలో ఉంది. దీందో ఈ ప్రాంతంలో… -
Ring of Fire: ఎందుకు ఈ వరస భూకంపాలు.. ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఏం జరుగుతోంది..?
Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. -
Japan Earthquake: ఒక్క రోజులోనే 150 భూకంపాలు.. జపాన్ పరిస్థితికి కారణాలేంటి..?
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని అనుకున్న అక్కడి ప్రజలకు కన్నీటిని మిగిల్చింది. దేశంలోని వాయువ్య ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. కేవలం ఒకే రోజులో 150కి పైగా భూకంపాలు జపాన్ దేశాన్ని తాకాయి. -
Earthquake: వనాటులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Earthquake: ఓషియానియా ప్రాంతంలో ఉన్న ద్వీప దేశం వనాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనాలకు దక్షినంగా గురువారం ఈ భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో దీని తీవ్రత 7.3గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సవరించి 7.1గా వెల్లడించింది. భూమికి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. -
Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రాజధాని మనీలా ఖాళీ చేయాలని ఆదేశాలు..
Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ వరస భూకంపాలతో భయపడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్‌లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
Earthquak: ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Earthquak: ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది. భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది. -
Solar Eclipse: ఈ రోజు సూర్యగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా..?
solar eclipse: సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం అయినప్పటికి హిందూ మంతంలో మాత్రం ఈ గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఉంది. ఈ మాట ఇప్పుడు చెప్పుకోవడానికి గల కారణం.. ఈరోజు అంటే 14 అక్టోబర్ 2023న సూర్యగ్రహణం సంభవించనుంది. కాగా ఈ ఏడాదిలో ఇది రెండవ సూర్యగ్రహణం. శారదీయ నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ గ్రహణం ఏర్పడనుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? ఈ ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడనుందో ఇప్పుడు… -
Earthquake: జపాన్‌లో భారీ భూకంపం..
Earthquake: జపాన్ దేశం మరోసారి భూకంపానికి వణికింది. జపాన్‌లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.42 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. సునామీపై ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. భూకంపం ధాటికి నగానో మరియు కనజావా మధ్య షింకన్సేన్ బుల్లెట్ రైళ్లను నిలిపేశారు. సుజీ సిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి. -
Earthquake: పసిఫిక్ తీరంలో భారీ భూకంపం..
Earthquake: పసిఫిక్ తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పనామాలోని పసిఫిక్ తీరంలోని బోకా చికా పట్టణానికి సమీపంలో మంగళవారం ఈ భూకంప వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం 5.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర బోకా చికాకు దక్షిణంగా 71 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!