Rahul Gandhi Sabha: వరంగల్ సభకు బయల్దేరిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. అక్కడినించి హనుమకొండకు బయల్దేరతారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు.
రైతు సంఘర్షణ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనుంది. అక్కడి మైదానం ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలతో ముస్తాబు అయింది. రాహుల్ పర్యటన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాన వేదికకు ఒకవైపు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబసభ్యుల కోసం ఓ వేదిక, మరోవైపు కళాకారుల కోసం మరో వేదిక ఏర్పాటు చేసారు. వీఐపీల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
వరంగల్ ఆర్ట్స్ అండ్స్ సైన్స్ కాలేజీలో జరుగుతున్న రాహుల్ సభ కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్ళాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సిటీకి ఐదు కిలో మీటర్ల దూరం లోనే నేతల వాహనాలు ఆపేయడం తో పెద్ద నేతలు కూడా స్వంత వాహనాలు పక్కన పెట్టి ట్రాలీ ఆటో లో వెళుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సామాన్య కార్యకర్తలతో కలిసి మడికొండ నుండి ట్రాలీ ఆటో లో వెళుతున్నారు. జనం నుండి వస్తున్న స్పందనకు ఇదే ఉదాహరణ అంటున్నారు కోమటిరెడ్డి.
సభ ముగిశాక వరంగల్ నుంచి రోడ్డుమార్గాన హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు రాహుల్‌గాంధీ నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై వివిధ అంశాలను చర్చించనున్నారు. శనివారం సాయంత్రం రెండ్రోజుల పర్యటన ముగిశాక రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి వెళతారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!