CM Revanth Reddy : ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించారు. ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక శాసన సభ్యులు పాయల్ శంకర్, రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు స్వాగతం పలిచారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి, మహిళా సంక్షేమం, విద్యా, భద్రతా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు, మొత్తం రూ.260.45 కోట్ల నిధులను కేటాయించారు.
మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధికి రూ.18.70 కోట్లతో శంకుస్థాపన జరిపారు. ఇందిరా మహిళా శక్తి క్రింద స్వయం సహాయక మహిళా సంఘాలతో కలిసి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడానికి రూ.1.75 కోట్లు కేటాయించారు. అలాగే 160 స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలుగా రూ.19.69 కోట్లను మంజూరు చేశారు. పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) నిర్మాణానికి రూ.200 కోట్లతో శంకుస్థాపన జరిగింది. అదనంగా, మహాలక్ష్మి వాడ, విద్యానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరణకు రూ.2 కోట్లు కేటాయించబడ్డాయి.
పట్టణ భద్రతను బలోపేతం చేయడానికి కూడా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్‌లో 18 పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.11.93 కోట్లు, 3 ఇంటెలిజెన్స్ విభాగం క్వార్టర్స్‌కు రూ.2.6 కోట్లు, భరోసా కేంద్రం ఏర్పాటు కోసం రూ.2 కోట్లు కేటాయించారు. పట్టణ అభివృద్ధికి కీలకమైన అంశం స్థిరమైన విద్యుత్ సరఫరా, అందులో భాగంగా TGNPDCL ద్వారా కొత్త కలెక్టరేట్ సమీపంలో 33/11 KV సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.231.24 లక్షలు కేటాయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు అయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. 2ఏళ్ల లో ఒక్క రోజైనా సెలవు తీసుకున్నానా అని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న వయస్సులోనే అన్ని అవకాశాలు ఇచ్చారని, నిరంతరం శ్రమ చేస్తూనే ఉన్ననన్నారు సీఎం రేవంత్. దేవుడి సంకల్పం ఉంటే అన్ని సాధిస్తామని, తెలంగాణ రాష్టానికి సీఎం గా రెండేళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగిందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ నగేష్ లను సభ వేదిక పైన మాట్లాడించామన్నారు. ఎందుకు అంటే మా లాగే వారిని ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, గతంలో ప్రతిపక్షం వాళ్ళను సంచివాలయంకు రానివ్వలేదు, ఇపుడు అలాంటి లేదు ఉండదని ఆయన వెల్లడించారు.
తల్లి సోనియా ఆశీస్సులు తీసుకొని వచ్చానని, వంద దేశాలకు ఆతిధ్యం ఇస్తుండగా అందరిని కలసి ఆహ్వానించడం జరిగిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయం ఉండాలి కదా.. ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టు ఉండాలి గా ఎయిర్ పోర్టు ఉండాలి అని ఆలోచించామన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ అయి ఉండ వచ్చు.. ఏడాది లోపు ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తాం.. ఎర్ర బస్సు ఎరుగని ప్రాంతం లో ఎయిర్ బస్సు దింపు తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రేమ్ సాగర్ రావ్ సహకారంతో దళిత గిరిజన దండోరా నిర్వహించామని, ఇంద్ర వెళ్లి పోరాట స్పూర్తి అమరుల కుటుంబాలు ఆదుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని ఆయన హమీ ఇచ్చారు.
Jaish-e-Mohammad (JeM): 5000 మంది “మహిళా ఉగ్రవాదులు” రిక్రూట్.. జైషే మహ్మద్ ఆత్మాహుతి ట్రైనింగ్..
అంతేకాకుండా.. రాబోయే రెండు నెలల్లో ఇక్కడి కే వస్తా.. రోజు అంతా సమీక్ష చేస్తా. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తా. కేసీఆర్ ప్రాణహిత ను కాలగర్భం లో కలిపాడు. పేరు ఊరు మార్చాడు.. కాళేశ్వరం కడితే మూడేళ్ల లో కూలే శ్వరం అయింది. తరలిపోయి కరీంనగర్ జిల్లా లో కట్టారు. లక్ష కోట్లు గోదావరి పాలు అయ్యాయి. అక్రమం చేస్తే ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి ఏందో చూడండి. వాళ్ళ ఇంట్లో పైసల పంచాయితీ తప్పా మరోటి లేదు. ప్రాణహిత కు టెండర్లు పిలిచాము. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు ను కట్టి తీరుతాం. ప్రారంభోత్సవానికి నేనే వస్తా. బీజేపీ నేతల సహకారం తీసుకుంటా. మూత పడిన సిమెంట్ పరిశ్రమలు మళ్ళీ ప్రారంభించేందుకు కృషి చేస్తా. ఆదిలాబాద్ ను వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎడ్యుకేషన్ ,ఇరిగేషన్ కమ్యూనికేషన్ ,ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఆ లక్ష్యం తో పనిచేస్తాం అభివృద్ధి చేస్తా ము. ఖమ్మం కు వర్శిటీ ఇచ్చాము.
ఆదిలాబాద్ కు వర్శిటీ ఇస్తాం. అంతా కలిసి ఓ నిర్ణయంకు రండి. ఇంద్రవెల్లిలో వర్సిటీ కడితే బాగుటుంది.. ఇంద్రవెల్లి లేదా కొమురం భీం పేరుతో వర్సిటీ పెడితే బాగుంటుంది. నిర్ణయం మీరు తీసుకోండి అనుమతి ఇస్తాం.. వర్శిటీ కి స్థలం ఎక్కడో మీరే నిర్ణ యించండి అని.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులకు సీఎం సూచించారు. ఇదే కాకుండా.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌కు కావాలి.. ఎన్నికల కోసం అని తిరగకండి.. మంచిగా చదవండి.. ఉద్యోగాలు సాధించాలి అని నిరుద్యోగులకు సీఎం కీలక సూచన చేశారు.
Minister Ramprasad Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు..!