Home
Revanth Reddy
Revanth Reddy News
-
CM Revanth Reddy : కెనడా హైకమిషనర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం ఆయనను కలిసింది. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యం గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి కెనడా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలియజేస్తూ,… -
KTR : జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్,… -
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరేస్తుంది అనే నమ్మకం నాకు వచ్చింది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. ప్రతి సారి అవకాశం రావడం జరగకపోవచ్చు కానీ,… -
CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!
CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, వరద ముంపు పరిస్థితులు, చెరువుల పరిరక్షణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాళాలు, చెరువులపై అక్రమ కబ్జాలు చేస్తున్న వారెవరైనా వదలరాదని సీఎం హెచ్చరించారు. “ఎంతటి పెద్దవాళ్లు… -
Mohammed Azharuddin: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఏ శాఖ కేటాయిస్తారు..?
Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు. -
CM Revanth Reddy: నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..
CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్,… -
CM Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు.. రేపు ముంపు ప్రాంతాలకు రేవంత్..
CM Revanth Reddy: తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన… -
Hanmakonda : నీట మునిగిన 4 వేల ఇండ్లు.. హన్మకొండ కన్నీళ్లు
Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ… -
Telangana BJP : సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారు.. బీజేపీ ఫిర్యాదు
Telangana BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం… -
Revanth Reddy : వరంగల్ కు సీఎం రేవంత్.. ముంపు ప్రాంతాల్లో పర్యటన
Revanth Reddy : మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరం నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీయనున్నారు. వరంగల్,…
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!