KTR : తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్… ప్రాజెక్టులు, కేసులు, బదిలీలు, నోటీసులు వంటి పలు అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఆయన, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా నడుస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏమీలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా కాళేశ్వరం గురించి కూడా…
CM Revanth Reddy: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి…
MLC Kavitha: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఖండిస్తూ ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. Read Also: IPL 2025 Final: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లకు కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ..! ఈ సందర్బంగా ఆమె, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ…
NVSS Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఓ రహస్య రాజకీయ డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనానికి గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని, ఇప్పటికే రెండుపార్టీల కీలక నేతల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. ఈ డీల్లో భాగంగానే కాలేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై…
Harish Rao : అంగన్వాడీ ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి宀కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది గడుస్తున్నా, వేతనాల పెంపు మాట మరిచిన ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకున్నదని, కానీ వాస్తవంగా మూడు నెలలకే పెరిగిన జీతం చెల్లించి మిగతా నెలలంతా…
అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి…
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దతామని…