Home
Revanth Reddy
Revanth Reddy News
-
Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా డబ్బులు పడేది ఆరోజే..
Rythu Bharosa: తెలంగాణలోని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. కేబినెట్ ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30వ తేదీన అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే… -
Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్‌కు లెఫ్ట్ వార్నింగ్.!
Telangana : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఉన్న ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. సదరు రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష (లెఫ్ట్) పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం డిమాండ్ చేసింది.… -
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
CM Revanth Reddy: ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) విద్యా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 లక్షల… -
Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
CM Revanth Reddy Launches Telangana Public School: తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (Telangana Public School) ప్రారంభమైంది. ఆరుట్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ బస్సులో సీఎం ప్రయాణం: ఆరుట్లకు చేరుకున్న సీఎం, అక్కడ ఏర్పాటు… -
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
Telangana Public School: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School)’ (TPS) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చారు. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ పాఠశాల భవనాన్ని నేడు (జూన్ 17)న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా… -
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
Off The Record: హైదరాబాద్ మెట్రో కేంద్రంగా మాటల మంటలు రేగుతున్నాయి. ఫేజ్-2 పై తెలంగాణ నేతల మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. ఇది తిరిగి తిరిగి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆమోదాల అంశాలకు సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. మెట్రో కారిడార్స్లాగే… ఇది రకరకాల మలుపులు తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనే స్థాయికి చేరింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర… -
CM Revanth Reddy: అల్లు అర్జున్ సినిమాలో సీఎం రేవంత్‌రెడ్డి.. అప్పట్లో ఎలా ఉన్నారో చూడండి..
CM Revanth Reddy: 'పుష్ప' సినిమాతో గ్లోబల్ వైడ్‌గా తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే పుష్ప కంటే ముందే టాలీవుడ్లో బన్నీ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. 'ఆర్య'తో లవర్ బాయ్‌గా అలరించి, అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. కెరీర్లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రాల్లో పరుగు ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీల్గుడ్ ఎంటర్టైనర్ అప్పట్లో సూపర్ హిట్ టాక్… -
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
CM Revanth Reddy : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) ప్రక్రియపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కన పెట్టారని, ‘అనుమానాస్పదం’ అనే నెపంతో వాటిని తొలగించే పెద్ద ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు… -
Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
Vemulawada Rajanna Temple : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, దేవాదాయ శాఖ మంత్రి , ఉమ్మడి జిల్లా మంత్రుల సహకారంతో ఈ చారిత్రాత్మక ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. శృంగేరి… -
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
CM Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే అంతర్జాతీయ ప్రమాణాల రవాణా సౌకర్యాలు అవసరమని, ఆ ఆలోచనతోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ నిర్ణయం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రారంభంలో రూ.15 వేల కోట్ల అంచనాతో మెట్రో పనులు…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..