CM Revanth Reddy : తెలంగాణలో రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాకుండా, అది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, ఆకలి తీరేందుకు ఉపయోగపడే…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్…
తెలంగాణ నుంచి చాలా తక్కువ మంద సినీ యాక్టర్ ఉన్నారని.. అందుకే కొత్త వాళ్లను పోత్సహించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
CM Revanth Reddy : హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెరికా స్వాతంత్ర్యం ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని ప్రశంసించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలవడమే కాకుండా, ఆవిష్కరణలకు నాంది పలికిన దేశంగా ఎదిగిందని రేవంత్ పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించని ఆత్మవిశ్వాసం అమెరికా స్ఫూర్తికి చిహ్నమని, అదే తరహాలో…
Renuka Chowdhury: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిను ప్రశంసలతో ముంచెత్తారు. ఇది రాజకీయ నిర్ణయం కాదని, సామాజికంగా గొప్ప మార్పునకు నాంది అని అభివర్ణించారు. అలాగే, ఇవ్వాళ నాకు చాలా గర్వంగా ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రజలందరికీ గర్వపడే…
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయన్నారు. మెడిగడ్డ పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపింది. అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందింది. ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమీషన్‌కు అందజేశాం. కానీ,…
MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు. కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన…