BRS vs Congress : సంగారెడ్డి జిల్లా హత్నూరులో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్-బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది.
“ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా, లేక పార్టీ కార్యక్రమమా?” అని ప్రశ్నించారు.
IND vs ENG: జైస్వాల్‌కు బయపడి.. అంపైర్‌కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!
ఈలోగా, అక్కడికొచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని చింపివేయడానికి ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను సభా ప్రాంగణం నుండి బయటకు పంపి పరిస్థితిని నియంత్రించారు. అయితే ఘర్షణతో కార్యక్రమం తాత్కాలికంగా అంతరాయం కలిగింది.
ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాలు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు నమోదు చేసుకున్నాయి. ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో వరుసగా రాజకీయ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరింత చర్చనీయాంశమైంది.
PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ కాలేదా..? అయితే ఇలా చేయండి..