ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది.