CM Revanth Reddy : హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో జరిగిన గ్రూప్-2 నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 783 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సచివాలయ అధికారులు రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నిస్సహాయకులకు సహాయం చేయడం మన బాధ్యత. తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం ప్రతి ఉద్యోగార్థి బాధ్యత. మీరంతా దీని కోసం అంకితమవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి, అదే మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో ఉంచతాము. జీతం వచ్చే అదే రోజున తల్లిదండ్రుల ఖాతాలోనూ ఈ సొమ్ము జమ అవుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకువస్తాం.”
Google: గూగుల్ దీపావళి ఆఫర్.. కేవలం రూ. 11కే ప్రీమియం సర్వీస్..
అంతేకాకుండా.. “శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య వంటి యువ విద్యార్థులు తమ త్యాగంతో తెలంగాణ ఉద్యమాన్ని సాధించారు. కానీ, ఆ తర్వాత రాజకీయ నేతలు నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడంతో నిరుద్యోగ సమస్యలను పట్టించుకోలేదు. వారి కుటుంబాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజల అవసరాలను పక్కన పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు సంవత్సరాల్లో కూలడం, ప్రభుత్వ పాఠశాలల విద్యను ఉపయోగించకపోవడం, రైతులకు ఆర్ధిక జ్ఞానం అందించకపోవడం ఈ వ్యవస్థలో లోపాలను చూపుతుంది,” అని గుర్తు చేశారు.
“పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? ఇలాంటి ఆరోపణలు అవమానకరంగా ఉన్నాయి. కష్టపడి చదివిన యువతే ఉద్యోగాలు పొందాలి. రాజకీయ విమర్శలపై ఆవేదన కలిగింది, కానీ నిజానికి యువతకు అవకాశాలు ఇచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో జరగని కుల గణన కూడా కాంగ్రెస్ పోరాటం వల్ల త్వరలో సాధ్యమవుతుంది,” అని రేవంత్ అన్నారు.
Google: గూగుల్ దీపావళి ఆఫర్.. కేవలం రూ. 11కే ప్రీమియం సర్వీస్..