రాష్ట్రంలో అందరి జీవితాలలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలిస్తే వేదిక పైన ఉన్న పెద్దలు రాష్ట్రంలో 90% సీట్లు గెలిపిస్తారు అని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి తెలిపాడు.
హాత్ సే హాత్ జొడో లో భాగంగా నేను కూడా యాత్ర చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జిల్లాలో పాదయాత్రకి జగ్గారెడ్డి అనుమతి కోరారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు.
Off The Record: చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి… నా మనసులో ఆవేదన ఉందంటూ తాజాగా ప్రకటనలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద తూటాలు ఎక్కుపెట్టారా అన్న అనుమానాలు మొదలయ్యాయట. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు నాయకులందర్నీ పిలిచి రేవంత్ మాత్రం వదిలేశారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి తన మనసులో ఉన్న విషయాలను వరుసగా ప్రకటనల రూపంలో విడుదల…
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. కందిపప్పులో నూర్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.