Kishan Reddy letter to Sonia Gandhi: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ - 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్" పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవల ఢిల్లీకి వచ్చి స్వయంగా సోనియాగాంధీకి అందించారు. ఈ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్…
OTR: పంచాయతీ ఎన్నికల ఫలితాలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని తీరుకు ముడి పడుతోందా? రిజల్ట్ సరిగా లేని చోట జిల్లా మంత్రుల మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నారా? రేపు కేబినెట్ మార్పు చేర్పులకు, దీనికి లింక్ ఉండబోతోందా? కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో?
Harish Rao: రేవంత్ రెడ్డి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్, నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్ మాత్రం యాప్ లు, మ్యాప్ లు కావాలి అంటుందన్నారు. తాజాగా మెదక్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి వచ్చాక బస్ ఛార్జీలు రెండేళ్లలో రెండింతలు పెరిగాయి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఆరోపించారు. రైతులకు యూరియా సరిపడ రెండు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు.. కాంగ్రెస్ చేసే తుగ్లక్…
Off The Record: క్షేత్ర స్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి పోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్‌లో అయితే… పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చుగానీ… వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా… కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్ళే దెబ్బ కొట్టడం…
Mohammad Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి శాఖలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మద్ అజహరుద్దీన్ గత నెల 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (Joint User Airfield) ఏర్పాటుకు సంబంధించి మొత్తం 700 ఎకరాల భూసేకరణకు అనుమతి మంజూరు చేసింది.
Sudharshan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు కీలకమైన భాధ్యత లభించడం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సమతుల్యత సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన…
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ…
Wines Tender : తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. గత వారం బీసీ బంద్ , కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ,…
Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక…