ఇండియా టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. కెరీర్లో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది. 2001 లో సానియా మీర్జా తన కెరీర్ ను ప్రారంభించింది.
తన కెరీర్లో ఇప్పటి వరకు 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలుసాధించింది.పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో పెళ్లి చేసుకుంది. 2018లో ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తమ బిడ్డకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే పేరును కూడా పెడుతున్నట్లు గతంలో షోయబ్ మాలిక్ ప్రకటించారు. ఇదిలా ఉంటే దేశానికి, క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2006లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషన్ అవార్డ్ను పొందింది.సానియా మీర్జా చాలా కాలంగా సింగిల్స్ ఆడటం మానేసింది. డబుల్స్‌లో కూడా తన ర్యాంకు మెరుగు పడకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణం అయి ఉండొచ్చు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఆమె సింగిల్స్ కెరీర్లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి క్రీడాకారిణులపై మంచి విజయాలు నమోదు చేసుకున్నారు. 2007లో సింగిల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా గుర్తింపు పొందారు. మణికట్టుకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సింగిల్స్‌కు దూరమయ్యరు. కానీ డబుల్స్ లో ప్రప్రంచ నెం.1 ర్యాంకు సాధించారు. తన కెరీర్‌లో అత్యధిక పారితోషకం తీసుకన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది సానియా మీర్జా. మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లోను ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్2014లో అర్హత సాధించడంతో పాటు టైటిల్‌ను కూడా సానియా గెలుపొందారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించుకున్నారు. అందులో 6 బంగారు పతకాలు ఉన్నాయి. అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను “50 హీరోస్ ఆఫ్ ఆసియా”గా పేర్కొంది
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!