ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు శనివారం చెపాక్‌లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను వీక్షించారు. మహీ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీ తరఫున ఆడుతుండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు హాజరైన నేపథ్యంలో మహీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్…
Virat Kohli : విరాట్ కోహ్లీ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక్క మ్యాచ్ కోసం తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానంటూ ప్రకటించేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకున్నాడు విరాట్. దానికి కారణం ఒలంపిక్స్. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో జడేజా తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడమే ఇందుకు కారణం. రిటైర్మెంట్ వార్తలపై జడ్డు ఫైర్ అయ్యాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాస్తారా? అని మండిపడ్డాడు. దయచేసి పుకార్లు పుట్టించకండి అని జడేజా కోరాడు. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్…
Tamim Iqbal Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి బంగాళాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పునరాగమనం చేయగలడని గత కొన్ని రోజుల ముందు ఊహాగానాలు ఉండేవి. అయితే, ఈ వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం లేదని ప్రకటించడం ద్వారా అన్ని చర్చలకు ముగింపు పలికాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో, అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ తమీమ్ ఇక్బాల్ 35 ఏళ్ల…
Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ప్లేయర్ వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన గప్టిల్, గత రెండు సంవత్సరాల నుండి న్యూజిలాండ్ ప్లేయింగ్ జట్టులో స్థానం సంపాదించుకోకలేకపోతున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసిన గప్టిల్, న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అయితే, గప్టిల్ ఇంకా టీ20 లీగ్…
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య చిన్నా..పెద్ద తేడా లేకుండా కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయి.
PM Modi on Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనం రేపింది. అశ్విన్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఆయన ఆఫ్ స్పిన్‌లో ఒక స్పెషల్ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ, బార్డర్-గావస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అన్ని అనుమానాలను కలిగించింది. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేసినప్పుడు, భారత డ్రెస్‌రూమ్…
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది.
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు.