మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…