పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారిగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన 'ఆడుజీవితం' చిత్రం అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.
హాలీవుడ్ వాళ్ల చేత కూడా జేజేలు కొట్టించుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఓ గే లవ్ స్టోరీగా పేర్కొంటూ ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూక్కుట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! తానో చెత్త సినిమా చూశానని మొదట మునీష్ భరద్వాజ్ ట్వీట్ చేస్తే.. దాన్ని రీట్వీట్ చేస్తూ రసూల్ పై విధంగా కామెంట్ చేశాడు. దీంతో, ఇది అగ్గి రాజేసింది. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ఓ వ్యక్తి, ఇలా కామెంట్ చేయడం నిజంగా ఊహించనిదంటూ…
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా చరిత్రపుటలకెక్కింది. ఇంకా ఈ సినిమా ఎన్నో ఘనతలు సాధించింది. అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసింది. అయితే, కొందరికి మాత్రం ఈ సినిమా నచ్చలేదు. కొందరు అజ్ఞానులైతే దీనిని ‘గే సినిమా’గా పేర్కొన్నారు కూడా! ఇప్పుడు అలాంటి వారి జాబితాలో తాజాగా ఆస్కార్ విన్నింగ్…