గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసి నదికి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా నగరంలోని…
హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసరాల వైపుకు గణపయ్యలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో నిమజ్జన కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. దీంతో ఈరోజు కూడా నిమజ్జనం జరుగుతున్నది. నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ గణపయ్య వాహనాలతో నిండిపోయాయి. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వర్షంలోనే శోభాయాత్ర…
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కేసుల ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఆరాష్ట్రంలో మళ్లీ నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఇక, కేరళ సరిహద్దుగా ఉన్న కర్ణాటక కీలక నిర్ణయం తీసుకున్నది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పని సరిగా సంస్థాగతంగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.…
రాత్రి సమయంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించేందుకు వందల సంఖ్యలో నగరవాసులు అక్కడికి వస్తుంటారు. ఒకవైపు పర్యాటకులతో పాటు, ట్రాఫిక్ రద్ధీకూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ రద్ధీ అధికం. దీంతో ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరవాసుల ట్యాంక్‌బండ్ సందర్శనకు…
డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2019లో వూహన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా మహమ్మారి సమయంలో వూహన్‌లో అప్పట్లో కఠినమైన నిబంధనలు అమలుచేశారు. కరోనా సోకిన వారికి ఇళ్లలో ఉంచి బయట తాళాలు వేశారు. ఐరన్ బార్స్‌తో తలుపులు తెరుచుకోకుండా చేశారు. కరోనా నుంచి కొలుకునే వరకు ఇంటి నుంచి ఎవర్నీ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డెల్టావేరియంట్ ఆ…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం వెయ్యి వరకు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది. ఆగస్ట్ 14 వ తేదీతో నైట్‌కర్ఫ్యూ పూర్తవుతుంది. 14 తరువాత కర్ఫ్యూను పొడిగించే ఆలోచనలే ఏపీ ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తోంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి స్కూళ్లను తిరిగి ప్రారంభించబోతున్నారు. స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తే నైట్ కర్ఫ్యూ అమలు చేయడం కుదరనిపని. ఇకవేళ పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేయడం వలన ఇబ్బందులు కూడా రావొచ్చు. నైట్ కర్ఫ్యూని ప్రణాళికా…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి ఉద్యమానికి ప్రజలు నడుం బిగించి నేటికి 600 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రాజధానిలోని హైకోర్టు నుంచి మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వరకు ర్యాలీని నిర్వహించాలని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి…
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని…
అసోంలో ఆంక్షలను పోడిగించారు. పొడిగించిన ఆంక్షలు జూన్ 16 నుంచి 22 వరకు అమలులో ఉండబోతున్నాయి. పొడిగించిన ఆంక్షలు జూన్ 16 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 22 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితులను సమీక్షించామని, కరోనా బాధితుల సంఖ్య, వ్యాప్తిరేటు క్రమంగా తగ్గుతోందని, కానీ, తీవ్రత, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయని అసోం రాష్ట్ర విపత్తు నిర్వాహణ అధారిటీ…