ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
China: చైనాలో మిస్టరీ వ్యాధి ప్రబలుతోంది. న్యూమోనియాతో అక్కడి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధి విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే అని చైనా ప్రభుత్వం చెప్పింది.