భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. వరద తాకిడికి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్1790 అడుగులు కాగా.. 1789.25 అడుగులకు చేరిన నీటిమట్టం.. హిమాయత్ సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా.. ప్రస్తుతం 1762.80 అడుగులకు చేరిన నీటిమట్టం..6 గేట్లు 5 అడుగుల మేర తెరిచి 3072 క్యూసెక్కుల నీటిని ఉస్మాన్ సాగర్…
Water Level in Reservoirs: భారత దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఇదే టైంతో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126 శాతం అధికంగా నమోదైనట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది.
Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా మారాయి అన్నారు. ఇక, మూడు నధుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
Harish Rao: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న అంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఎండిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయని సీబ్ల్యూసీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా…
ఈ మధ్య రిజర్వాయర్ల వద్ద జరగుతున్న నేరాలను అరికట్టేందుకు జలమండలి అధికారులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జలాశయాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ట్యాంకులో కుళ్లిన మృతదేహం రావడంతో అధికారులు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిఘా పరిధిలోకితేనున్నారు.రిజర్వాయర్ల వద్ద పర్యవేక్షణ, భద్రతపై జలమండలి ఎండీ దానా కిశోర్ ఆరా తీశారు. నగరంలో మొత్తం 378…
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర సమగ్ర పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలన్నారు. రాష్ట్ర విభజన నుంచి వీటి గురించి పట్టించుకోలేదు.. దీని వల్ల ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా తగినంత మంది నిర్వహణా సిబ్బంది ఉన్నారా లేదా…