రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
RBI: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అలాగే నేటి నుంచి బ్యాంకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక వృద్ధి నమోదైంది. మొట్టమొదటిసారిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడానికి చాలా దగ్గరగా వచ్చింది. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఇది ఒక పెద్ద అడుగు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అంటే బ్యాంకులకు 15 రోజులు సెలవులే ఉన్నాయి.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణదాతలు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ బ్యూరోలకు కస్టమర్ ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపింది. అలా చేయని పక్షంలో ప్రతిరోజూ రూ.100 జరిమానా చెల్లించి ఈ మొత్తాన్ని వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది.
RBI 2000 Rupees Note Exchange: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించారు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2023 అక్టోబరు 7 వరకు రూ.2000 నోట్లను మార్చుకోకపోవటం వల్ల కలిగే ప్రభావం గురించి ఇందులో ఆయన మాట్లాడారు.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
RBI MPC Meeting: ద్రవ్యోల్బణం భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చు. దీనిపై ప్రపంచ బ్యాంకు స్వయంగా ఆమోదించింది.
RBI MPC Meeting: ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశం జరుగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు ఈసారి కూడా మార్చదని తెలుస్తోంది. వారం చివరిలో వడ్డీ పెంపుపై నిర్ణయం తీసుకోబడుతుంది.