RBI: ఆర్బీఐ వార్నింగ్.. వాటిని నమ్మి మోసపోవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. సర్వీస్ రుసుము పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయి. ఈ ప్రకటనలు ఆర్‌బీఐ దృష్టికి రావడంతో.. వాటిని నమ్మొద్దని వినియోగదారులను వార్నింగ్ ఇచ్చింది. రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. నకిలీ ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
Read Also: Rajinikanth: ఇలాంటి సూపర్ స్టార్ ని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్…
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. “కొన్ని కంపెనీలు రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సర్వీస్/లీగల్ ఫీజు పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ సంస్థలకు ఎలాంటి అనుమతి లేదు. కొందరు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతాయి. ఇటువంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వం మరియు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అటువంటి సంస్థలతో సంబంధం కలిగి ఉండటం వలన ఆర్థిక నష్టాలు వస్తాయి. వినియోగదారులు ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని తన తన ప్రకటనలో పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!