Emmanuel Macron: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం అని పేర్కొన్నారు. ఈరోజు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని, రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ‘స్వతంత్ర భారతావనిని గణతంత్ర…
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది.
విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం 17,805 కోట్లు వ్యయం చేసిందని తెలిపారు. 15వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అందిస్తోందన్నారు. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. కుల, మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని ఏపీ గవర్నర్ చెప్పారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలను…
Stock Market Holiday: దేశమంతటా గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ జాతీయ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయబడతాయి.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని కొనియాడారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే చాలా పురాతనమైనది. అందుకే భారతదేశాన్ని "
Manoj Kumar Sharma:‘12th ఫెయిల్’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన అత్యుత్తమ చిత్రంగా ఉంది. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. సివిల్స్ సాధించేందుకు ఒక సాధారణ యువకుడు ఎదుర్కొన్న సంఘటనలు ప్రేక్షకులను కట్టిపారేశాయి. ఐపీఎస్ అయ్యేందుకు ఎలాంటి అడ్డుంకులు ఎదుర్కొన్నాడు, అమ్మాయి ప్రేమ ఉన్నత లక్ష్యాన్ని సాధించేందు ఎలా సహకరించిందనే విషయాలను డైరెక్టర్ విధువినోద్ చోప్రా తెరకెక్కించారు. చాలా మంది యువతీయువకులకు తన లక్ష్యాలను సాధించేందుకు ఈ…
రేపు (జనవరి 26న) దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలు జరుగనున్నాయి. దేశ రాజధానిలోని కర్తవ్య మార్గ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో దాదాపు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఆయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నారు.