సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు వైద్య వర్గాలు శనివారం తెలిపాయి.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం వచ్చే నెలలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్‌పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. విదేశీ యాప్‌లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు తెలిపారు.
సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కరెన్సీ నోట్ల నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.
బ్రిటన్ కింగ్ చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను సందర్శించే అవకాశం ఉంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని ప్రధాన కార్యాలయాన్ని మరొక చోటకు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు సమీపంలోకి మారుస్తోంది.
ఇరాన్ అణు పరిశోధనా కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తునే ముప్పు వాటిల్లినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఒక ప్రవాహంలా అశ్లీలత ప్రవహిస్తోంది. జుగుప్సకరమైన దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
సెబీ చీఫ్ మాధబి బుచ్‌కి పార్లమెంటరీ ప్యానెల్ షాకిచ్చింది. పార్లమెంటరీ కమిటీ శనివారం ఆమెకు సమన్లు జారీ చేసింది. సెబీ చీఫ్‌తో పాటు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అనిల్‌కుమార్ లాహోటీలను ఈ నెల 24 విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంట్‌లోని పబ్లిక్ అకౌంట్ కమిటీ (పీఎసీ) నోటీసులు జారీ చేసింది.