సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఒకప్పుడు శత్రు దేశంగా ఉన్న సిరియాతో తన సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా సిరియాతో సంబంధాలను నిలిపివేసిన సౌదీ అరేబియా సిరియా రాజధాని డమాస్కస్‌లో తన రాయబారిని నియమిస్తున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి.