Remal Cyclone : తుఫాను పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకినప్పటి నుండి, భారతదేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో చాలా చోట్ల వర్షం కొనసాగుతోంది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో వరదల పరిస్థితి ఏర్పడింది.
ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు! ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనన్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్‌ఆర్‌హెచ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు చిన్న ఓదార్పు దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఐపీఎల్…
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్ గా మారింది..…
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అధికారులను అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు.
Remal Cyclone : పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈరోజు, రేపు రెమల్ తుపాను కారణంగా మత్స్యకారులు సముద్రానికి దూరంగా ఉండాలని కోరారు.
రెమల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకొస్తోంది. రెమల్ తుఫాను ఆదివారం పశ్చిమ బెంగాల్‌కు చేరుకోనుంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు రెమల్‌గా నామకరణం చేశారు. రుతుపవనాల రాకకు ముందుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. అయితే ఈ తుఫాన్‌తో ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదు.