Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ…
CM Chandrababu: మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Andhra Pradesh: విజయవాడలోని సింగ్ నగర్ తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరాను ప్రారంభించారు. అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇండోర్ లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బెలేశ్వర మహాదేవ్ ఝులేలాల్ ఆలయం మెట్లబావికప్పు బావిలో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందుకలోకి పడిపోయారు. ఇప్పటికైతే 36 మంది చనిపోయారని తెలుస్తోందని చెప్పారు.
రుతుపవనాలరాకకు ముందే కర్నాటకలో భారీవర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో ఒక్కరోజులో 10 సెంటీమీటర్లకు పైగా వానపడడంతో ముంపులోనే అనేక ప్రాంతాలు వుండిపోయాయి. రెండవ రోజూ సీఎం సందర్శన కొనసాగుతోంది. బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత అతలాకుతలం చేసింది.…