మాండూస్ తుఫాను ప్రభావం రైతాంగంపై బాగా పడింది. నెల్లూరు జిల్లా వర్షాలతో వణికిపోతోంది. నెల్లూరు జిల్లాలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. సోమశిల జలాశయానికి కొనసాగుతుంది వరద ఉధృతి.. మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇన్ ఫ్లో-20,972 క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ ఫ్లో-20,730 క్యూసెక్కులుగా వుంది. జలాశయం పూర్తి సామర్థ్యం-78 TMCలు కాగా. ప్రస్తుతం 68.615 TMCలుగా వుంది. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుండడంతో.. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు..
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పెన్నా నదిలో పెరుగుతున్న ప్రవాహంతో సమీప గ్రామాల వాసులు వణికిపోతున్నారు. సంగం..నెల్లూరు బ్యారేజ్ ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి స్వర్ణముఖి..కాలంగి..కైవల్య నదులు. పంబలేరులో నీటి ప్రవాహం పెరిగింది. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు మత్స్యకారులకు సూచనలు జారీచేశారు.
Read Also: Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాడు.. తర్వాత సారీ చెప్పాడు.. ఎందుకు?
ఆత్మకూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు. ఏ. ఎస్. పేట మండలం తల్లపాడు వద్ద రహదారిపై చెరువు అలుగు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఆత్మకూరు-ఏఎస్ పేట మండలాలకు నిలిచిన రాకపోకలు. సంగం మండలం పెరమన వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న బీరాపేరు వాగు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అనంతసాగరం మండలం కచ్చిరిదేవరాయపల్లి వద్ద కొమ్మలేరు వాగు ఉధృతి. ముందు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు.
మాండూస్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాల జోరుకు చెరువులు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వరదల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టర్ కి వెంకయ్యనాయుడు ఫోన్

మరోవైపు నెల్లూరు జిల్లాలో తుఫాను పరిస్థితిపై మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వెంకయ్యనాయుడు..ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెంకయ్యనాయుడుకి వివరించారు కలెక్టర్. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్ కు సూచించారు వెంకయ్య నాయుడు.
ఇటు మాండూస్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెరువు,కాలువలు, నదులు పొంగిపొరలుతున్నాయి..ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాళంగి,ఎన్టీఆర్ జలాశయం,కృష్ణాపురం ,మల్లెమడుగు రిజర్వాయర్లు పూర్తిస్దాయిలో నిండిపోవడంతో వాటి గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
Read Also: Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాడు.. తర్వాత సారీ చెప్పాడు.. ఎందుకు?