యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది చివర్లో ‘అఖండ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన మరోసారి…