ఒత్తిడి (Stress) అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే సాధారణ సమస్య. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక కారణాల వల్ల మనసుపై తెలియకుండానే భారమొస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత నుంచి వృద్ధుల వరకు చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అది కేవలం మనసుకే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్రలేమి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు…
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది.