కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కర్ణాటకలో నానుతూనే ఉంది. హైకోర్ట్ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడానికి వ్యతిరేఖంగా తీర్పు చెప్పింది. అయినా కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. మండ్యా, శివమొగ, ఉడిపి, చిక్ బళ్లాపూర్, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈ వివాదంతో పాఠశాలల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా హిజాబ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం…